Health పలు అనారోగ్య సమస్యలకు కారణం వంటగది అపరిశుభ్రతని తాజా అధ్యయనాల్లో బయటపడింది.. వంటగదిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో సమస్యల బారిన పడాల్సి వస్తోందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
చాలావరకు ఆహారం వంటింట్లోనే కలుషితం అవుతుందని తాజాగా జరిగిన అధ్యయనాల్లో బయటపడిన విషయం అందరిని షాక్ కి గురి చేసింది.. చాలామంది తెలిసి తెలియక వంట గదిలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు.. అయితే దీని వలన కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం..
చాలామంది కూరగాయలు, మాంసాహార పదార్థాలను కట్ చేసినా చాపింగ్ బోర్డు పైనే పండ్లను కూడా కట్ చేస్తారు.. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు.. దీనివల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా పండ్ల లోకి చేరుతుంది.. అలాగే పచ్చి కాయగూరలను కడిగిన గిన్నెలోనే వండిన పదార్థాలను ఉంచటం కూడా సరికాదు.. అలాగే పచ్చి కాయగూరలను నీటితో కడిగితే సరిపోతుంది అనుకోకుండా.. పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టి కడగటం వల్ల వాటిపై ఉన్న సూక్ష్మజీవులు రసాయన పదార్థాలు పోతాయి..
అదే విధంగా ఫ్రిజ్ ను ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి.. లేదంటే అందులో దుర్వాసన వచ్చి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది… చికెన్ ను చాలామంది సింకులో నీళ్లతో కడుగుతూ ఉంటారు.. దీనివల్ల బ్యాక్టీరియా పూర్తిగా పోదు సరి కదా చుట్టూ ఉన్న అన్నింటి పైన ఆ బ్యాక్టీరియా వ్యాప్తిస్తుంది.. అలాగే మాంసాహార పదార్థాలను ఎక్కువ సేపు ఉడికించి వండాలి.. దీని వల్ల అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే నశిస్తుంది..