Kiran Abbavarams Sammatame First Look Out,Chandni Chowdary, Direction Gopinath Reddy, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: కిరణ్ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్ ఫీల్ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమాలో కిరణ్ అబ్బవరం కల ఏంటో ఆడియన్స్‌కు అవగాహన కలిగించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారని తెలుస్తుంది. అలాగే కిరణ్ అబ్బవరం పట్ల చాందినీ ప్రేమ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కనిపిస్తుంది. గడ్డంతో కిరణ్ హ్యాండ్‌సమ్ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫర్. విల్పావ్ నిషాదం ఈ చిత్రానికి ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి తదితరులు….
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
ప్రొడ్యూసర్: కనకాల ప్రవీణ
బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
డీఓపీ: సతీష్‌రెడ్డి మాసం
ఎడిటర్: విల్పావ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
పీఆర్‌వో: వంశీ–శేఖర్