కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్ లో తిరిగి ప్రారంభమైంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ లో నాగార్జున సరసన కథానాయిక గా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా బృందం తో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను కూడా టీమ్ ఆవిష్కరించింది.
నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం ఆనందం గా ఉంది. ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రం లో ప్రధాన తారాగణం. ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.