వరస సంక్రాంతి చిత్రాల విజయాలుతో కింగ్ “అక్కినేని నాగార్జున” దూసుకెళ్తున్న ఘనంగా “నా స్వామి రంగా” చిత్రం అనకాపల్లి పట్టణంలో విజయోత్సవ వేడుకలు, నేడు అనకాపల్లి షిరిడి సాయి థియేటర్లో అక్కినేని నాగార్జున గారు నటించిన నా స్వామి రంగా చిత్రం రిలీజ్ సందర్భంగా ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ “నక్కిన త్రినాధరావు గారు”, చలనచిత్ర సీనియర్ నటులు “ప్రసన్నకుమార్” గారు, హీరో “శాంతి చంద్ర”, దర్శకులు “ఆడారి మూర్తి సాయి” పాల్గొని నా సామి రంగా చిత్రం చూసి అనంతరం మంచి విజయం సాధించడంతో రాష్ట్ర అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకల్లో
అక్కినేని అభిమానులు సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు.
ఈ సందర్బంగా సినీ దర్శకులు నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ… అక్కినేని నాగార్జున గారు సంక్రాంతి పండుగలో అందరూ కుటుంబంతో కలిసి చూసే విధంగా పల్లెటూరు వాతావరణం లో నా సామి రంగా చిత్రం తెరకెక్కించారు అని కచ్చితంగా ఈ పండగ సెలవుల్లో అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అక్కినేని అభిమానులు సిహెచ్ అవతారం (అవ్వ), ఎస్. భానుచందర్ (అఖి), గోల్డ్ వాసు, జొన్నాడ సురేష్, చందక నర్సింగరావు, అఖిల్, దురు నాయుడు, కాశి, మోనో శీను, చంటి, సత్యనారాయణ, రాజబాబు, శివ, చందు, నూకేష్, రమణ, రాజు, మరియు పోలరపు త్రినాథ్, నక్కిన సురేష్, యల్లపు శ్రీనివాసరావు, పొలిమేర ఆనంద్, పెంటకోట శ్రీనివాసరావు, తరుణ్, బుద్ధ జోగినాయుడు, ఉప్పల సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.