B. R. S
K. C. R
T. R. S…………. ఓ సాధ్యాసాధ్యాల సమాహారం
B. R. S (భారత రాష్ట్ర సమితి) మంచో చెడ్డో కేసీఆర్ బలంగా నమ్మే కొన్ని విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని చెబితే… న్యూమరాలజీ ప్రకారం..
B. R. S= 7
K. C. R= 7 వస్తాయి, అంటే ఇదెలా ఉందంటే..
T. R. S= 9 కంటే B. R. S= 7 ఇదే ఎక్కువ కేసీఆర్ కి సూటవుతుంది అన్నదొకటి శుభసంకేతాలను ఇస్తోంది.. ఇంకేవుందీ, సార్ కి ఎలాగూ ఇలాంటి సెంటిమెంట్లంటే బాగా ఇష్టం కాబట్టి అన్నీ మంచి శకునములే అన్నట్టు ముందుకెళ్లడమే తరువాయి… విజయం తనంత తాను సారు భుజానికెక్కేస్తుందీ అన్నంత వీజీగా సాగుతుందా? జాతీయ పార్టీ అంటే అంత సులభమా? ఒక్క కేజ్రీవాల్ కి తప్ప ఇప్పటికే రెండు దశకాల క్రితం పెట్టిన తృణముల్, నేషనలిస్ల్ కాంగ్రెస్ పార్టీలకే సాధ్యం కాని ఫీట్.. ఆ మాటకొస్తే లోకల్ గా టీడీపీకి ఏపీలో అంతంత మాత్రం
తెలంగాణలో మొత్తం తుడిచి పెట్టుకుపోయిన స్థితిగతులు.. ఈ కండీషన్లో కేసీఆర్ కి నేషనల్ లెవల్ పార్టీ బిల్డప్ చేయడం సాధ్యమేనా? కేసీఆర్ కి ఉన్న బలాలేంటి?- బలహీనతలేంటి? అని ఒక సారి పరిశీలన చేస్తే…
మొదట కేసీఆర్ పెట్టబోతున్న బీఆర్ఎస్ ఒక వండర్, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత- ఇలా నేషన్ వైడ్ బ్రాంచ్ తెరవడం దాదాపు ఇదే మొదలు… గతంలో జన్ సంఘ్ పెట్టి తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించిన చరిత్ర ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది… మిగిలిన ఏ పార్టీకీ లేదనే చెప్పాలి.. ఈ క్రమంలో చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ ఉంటుందా ? బీఆర్ఎస్ పెట్టాక విలీనమవుతుందా? అంటూ ఆంధ్రజ్యోతి లేవనెత్తిన ప్రశ్న చాలా పెద్దది.. న్యూమరాలజీ ఎలాగూ గుడ్ సైన్ ఇచ్చింది కాబట్టి.. సారు సర్రున బీఆర్ఎస్ కు వెళ్లి పోతారా? అన్నది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. నిజానికి దేశంలో బలమైన నాయకత్వ శూన్యత ఉన్న మాట నిజమే కానీ దాన్ని ఫిలప్ చేయడం సాక్షాత్ మోదీ చేతుల్లో కూడా లేదు.. దేశం ఇపుడు బీజేపీ దాని నుంచి జనరేట్ అయ్యే హిందుత్వను విపరీతంగా కోరుకుంటోంది.. అందుకు నూపుర్ శర్మ ఇష్యూయే అతి పెద్ద ఉదాహరణ.. ఆమెను ఇప్పుడు ఒక జాతి మొత్తం సూపర్ హీరోగా భావిస్తోంది.. ఒక్క మహిళ ఇస్లామిక్ కంట్రీస్ యూనియన్ అనే ఒక మినీ ప్రపంచాన్ని ఎదర్కుంటోందన్న తీరు తెన్నులకు విశేషమైనపేరు వస్తోంది.. హిందూ సెంటిమెంటు ఎంత బలంగా ఉందో చెప్పక చెప్పే కండీషనిది.. ప్రెజంట్ ఈ ఇష్యూ మీద.. దళిత- ముస్లిం- మైనార్టీలు చేస్తున్న నిరసనలకు రోజుకు ఒక్కో కోటి హిందూ ఓటు బ్యాంకు సంఘటితమవుతూ వస్తోంది.. కొందరు తమ నోటి వెంట- రాత వెంట హిందుత్వకు మా మద్దతు అనే మాటలను బయట పడనీయడం లేదు కానీ , వాళ్ల వాళ్ల మనసుల్లో మాత్రం బీజేపీకే ఈ సారి ఓటు వేయాలన్న బలమైన ఆలోచన మరింత స్థిర పడుతూ వస్తోంది.. ఈ నిరసన గళాలు ఎంత పెరిగితే అన్నేసి సీట్లు బీజేపీకి బ్యాగ్ అవుతాయే తప్ప.. తగ్గే ప్రసక్తే లేదు.. మాములుగా జ్ఞానవాపి ద్వారా ఇదంతా సాధ్యమవుతుందనుకున్నారుగానీ.. అది నూపుర్ శర్మ అనే ఒక మహిళా నేత పేరిట సాధ్య పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు..
ఆమె కూడా తన వ్యాఖ్యల దుమారం ఇంత భారీ స్థాయిలో ఉంటుందని అనుకుని ఉండరు. ఇపుడామె ఇంటర్నేషనల్ హిందూ ఐకానిక్ లీడర్. సూపర్ మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్, బ్యాట్ మెన్, వంటి సూపర్ హీరోలెవరూ చేయలేని పని ఆమె చేసిందంటూ ఆమె ఒక సాఫ్రాన్ విమెన్ అంటూ కొందరు సోషల్ మీడియా మీదకు వదులుతున్న మీమ్స్ చూస్తుంటే.. నూపుర్ శర్మ వచ్చే రోజుల్లో ఎక్కడికో వెళ్లి పోతుందన్న సంకేతాలందుతున్నాయి. కర్ణాటకలో ఆమె దిష్టిబొమ్మను ఉరి వేయడాన్ని బట్టీ చూస్తుంటే ఆమె ఇమేజ్ అందనంత ఎత్తులో ఉందని స్పష్టమవుతూనే ఉంది.. ఇదంతా మనం నూపర్ శర్మ గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ.. బీజేపీ- 2024లో మరింత బలపడి చరిత్ర తిరగరాయటం ఖాయమన్న హింట్స్ మాత్రం క్లియర్ కట్ గా అందిస్తోంది.. దీనంతటికీ కారణం దళిత- మైనార్టీ వర్గాల తీవ్ర వ్యతిరేకతే..
వీళ్లెంత బలంగా నిరసిస్తే.. బీజేపీ అంత గొప్పగా స్థిరపడుతుంది.. ఇక ఏ కశ్మీరీ అంశమూ అక్కర్లేదు.. మరే పాకిస్థాన్ అప్రకటిత దాడీ చేయక్కర్లేదు.. ఈ ఒక్క ఇష్యూ చాలు.. ఆబ్కీ బార్ బీజేపీ సర్కార్ అనడానికి.. ప్రెజంట్ బీజేపీ కండీషన్ ఎలా ఉందంటే.. మాకిక ఏ మోదీ మార్క్ మెస్మరైజేషనూ అవసరం లేదు.. ఆయనకు వయసెలాగూ అయిపోయింది కాబట్టి.. పక్కన పెట్టి.. మా హండ్రెడ్ పర్సెంట్ హిందూ ఐకానిక్ లీడర్ యోగిని ప్రధాని పీటమెక్కించడానికి సిద్ధ పడ్డా ఆశ్చర్య పడక్కర్లేదు.. అంతగా దూసుకుపోతోంది బీజేపీ గ్రాఫ్.. ఈ కండీషన్లో కేసీఆర్, ఆయన పార్టీ సూర్యుడి ముందు దివిటీలా వెల వెల పోవడం లేదూ? అంటున్నారు కొందరు..
నిజానికి కేసీఆర్ ఇప్పటికిప్పుడు నేషనల్ లెవల్ పార్టీ పెట్టి దాన్ని ఇప్పటికిప్పుడు గెలుపు బాట పట్టించడం అంత తేలికేం కాదు.
మనందరికీ కేసీఆర్ ఒక సౌతిండియన్ కాబట్టి.. ఆయనలాంటి వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పితే.. చూడాలన్న ఆశ, ఆలోచన ఉండొచ్చుగాక.. అలాగని అదంత వీజీ మాత్రం కాదు.. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడో స్వాతంత్ర పోరాటానికి ముందు పుట్టిన పార్టీ.. దాని ఐడియాలజీ బలంగా విస్తరించడం- జన బాహుళ్యంతో అనితర సాధ్యమైన అభిమానం సొంతం చేసుకున్నాక గానీ.. అది ఒక పార్టీగా జాతీయ రాజకీయాలలో స్థిర పడలేదు.. ఇక బీజేపీ మోదీ హవాతో డబుల్ త్రిబుల్ విక్టరీస్ సాధిస్తోందంటే అంతకన్నా మించి అజ్ఞానం మరొకటి లేదు..
ఆర్ఎస్ఎస్ రూపంలో దానికి దశకాల తరబడి బలమైన చరిత్ర, వ్యవస్థ ఇంకా ఎంతో పేరు ప్రతిష్టలు.. అంతర్జాతీయ పలుకుపడి సొంతం..
పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మమతా నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండు దశకాబ్దాల పైబడ్డ చరిత్ర ఉన్నా కూడా ఇంకా ఒకే ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతున్నాయంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.. ఇదలా ఉంచితే.. ఎస్పీ, బీఎస్పీల్లో… బీఎస్పీకి కావల్సినంత నేషనల్ బ్యాగ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఆసేతు హిమాచలం దళిత బహుజనులు బహుగా ఉంటారు. వీరి ఆదరణ బై డీఫాల్ట్ బీఎస్పీకి ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీ పేరే బహుజన సమాజ్ పార్టీ. అలాంటి పార్టీకే జాతీయ స్థాయి విస్తరణ సాధ్యం కాలేదు. అధినేత్రి మాయావతి గత కొన్ని టరములుగా ఓన్ స్టేట్- యూపీలో అధికారానికి దూరంగా ఉంటున్నారు. ఆమె చుట్టు బిగుసుకుని ఉన్న ఉచ్చు అలాంటిది. ఇక దేశంలో ఆ స్థాయి రాజకీయాలను నడిపే దమ్ము సత్తా గల నాయకత్వమే కరవై పోవడం.. ఉన్న కాంగ్రెస్ పార్టీ శతాధిక వయో వృద్ధాప్యంతో చతికిలపడి ఉండటం చూస్తుంటే.. ఇప్పట్లో బీజేపీకి ఎదురే లేదున్న సంకేతాలందుతున్నాయి.
యాంటీ- బీజేపీ అన్న బ్రహ్మ పదార్ధం ఒకటుంది కానీ.. దాని కన్ను- ముక్కు- రూపు- షేపు.. లేవు. ఒక వేళ ఉన్నా అదంతా ఇసుక తక్కెడ- పేడ తక్కెడ వ్యవహారమే.. కారణం ఇక్కడ ఉన్నది మోనార్క్ మోదీ. అక్కడ వంద మోదీలు. వాళ్లలో ఎవరు ఎవరికి ఎక్కువ- తక్కువో చెప్పడం సాధ్యం కాదు. ఈ కిచిడీ కూటమితో మనం సాధించేదీ ఏదీ ఉండదని భావించడం వల్లే కేసీఆర్ ఏకంగా ఒక పార్టీ పెట్టాలని చూస్తున్నారు. సిద్ధిపేట్ మోడల్ నే తెలంగాణ మోడలనీ.. తెలంగాణ మోడలే దేశానికి ఆదర్శమనీ నమ్మబలికే యత్నం చేస్తున్నారు. మనమిందాకే అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీని బలపరిచేందుకు ఎంఐఎం లేదు. దళిత- ముస్లిం- మైనార్టీ సంఘాల్లేవు. ఇవన్నీ లేకుండా ప్రస్తుత భారత రాజకీయాలే లేవు.. ఈ విశ్వంలో చంద్ర మండలం అనేది ఒకటుంది కాబట్టే.. ఆ ఒత్తిడికి భూమిపై జీవం- జలం ఉద్భవించిందంటారు. సరిగ్గా అలాగే.. చంద్రమండలం స్థానంలో బీజేపీ అనే భూమండలానికి చంద్రయానం అనుసరించే ఇస్లామిస్టులు వారి వ్యతిరేకతలు బలంగా పని చేస్తుంటాయి. మరి చంద్రశేఖరరావును బలపరిచే సూర్యశేఖరరావులు ఎవరని ??? ఎపుడైతే బీఆర్ఎస్ కు ఫలానా ఓటు బ్యాంకు వర్గాల నుంచి బలమైన వ్యతిరేకత ఎదురవుతుందో మిగిలిన ఓటు బ్యాంకు ఆకర్షితమవుతంది. ప్రస్తుతం అలాంటి వ్యతిరేక వర్గాలు కేసీఆర్, ఆయన పెట్టే బీఆర్ఎస్ కు ఎక్కడున్నాయ్ ??? ఇక్కడంటే తెలంగాణ ఉద్యమం దాన్ని వ్యతిరేకించే కొన్ని పార్టీలుండబట్టి.. 2014లో కాంగ్రెస్ నుంచి, 2018లో టీడీపీని వ్యతిరేకించి.. 2023లో కేంద్ర ప్రభుత్వం- వివక్ష అనే సెంటిమెంట్లను రగిల్చి.. ఇక్కడ పార్టీని గెలిపించే ఎత్తు వేస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్. అదే దేశ ఓటర్ల ముందు ఏ వాదంతో ఆయన ఓట్ల బేరం చేస్తారు? వాళ్లను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ఓ పాతిక కోట్ల రూపాయలను పంజాబ్ మృత రైతు కుంబాలకు పంచగానే పెద్ద ఓట్లు రాలిపోతాయా !!! ఛాన్సే లేదు..
ఈ మధ్య తండ్రీ కొడుకులు ఒక వాదన తలకెత్తుకుని పదే పదే చెబుతున్నారు.. అదేంటంటే.. విదేశీ వేదికలపై భారత్- చైనాల మధ్య పోలిక తెస్తున్నారనీ మీ రెండు దేశాలు దాదాపు ఒకటే జనాభా గల దేశాలయినా.. ఆ జీడీపీ ఈ జీడీపీ కి ఇంత తేడా ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారనీ.. మా దేశంలో మతఘర్షణలు బూచిగా చూపించి అభివృద్ధిని వదిలేస్తుంటారని తాము చెప్పుకోవల్సి వస్తోందనీ.. అదే మన భారత దేశం నుంచి మతఘర్షణలను విడదీస్తే చైనాతో పోటీ పడే అభివృద్ధి సొంతమవుతుందనీ చెప్పుకొస్తున్నారు.. ఇందులో భారతీయుల నషాళానికెక్కే ఘాటు కానీ, కిక్కు కానీ ఎక్కడైనా ఉందా? భారత్ అంటే ఆమెలో డ్రామాయే వేరు.. వాళ్లకు అభివృద్ధి ఆవకాయ్ అవసరం లేదు..
నీ మతం నా మతం.. ఇద్దరి మధ్య లేని సమ్మతం… దీనికన్నా మించిన ఓటు బ్యాంకు ఫార్ములా లేనే లేదు.. ఈ కండీషన్లో భారత రాష్ట్ర సమితి అని ఒక పేరు పెట్టి దేశం మీదకు వదిలేయగానే ఓట్లు వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారా ??? అహ.. ఉన్నారా అని ?
ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది