Political News : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో ఒకరిపై ఒకరు ఎద్దేవ చేసి మాట్లాడుకుంటున్నారు. సీఎం కేసీఆర్ అయితే ఏకంగా ప్రధానమంత్రి ఉద్దేశించి ఎద్దేవ చేసి మాట్లాడటం ఇక్కడ విశేషంగా మారింది.ఆయన గురువారం.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ బహిరంగ సభలో మాట్లాడుతూ, పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు. ప్రసంగంలో మాట్లాడడం జరిగినది.
ఇది ఇలా ఉంటే ఇండియాలో దరిద్రపుగొట్టు వాతావరణం చూస్తున్నామని ఇటువంటి వాతావరణం ఎప్పుడు చూడలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలానే ఈ ప్రసంగంలో భాగంగా… మౌనంగా భరిద్దామా లేదా పిడికిలి బిగిద్దామా అని ఎద్దేవ చేయడం విశేషం.భరిస్తే మత చిచ్చు పెట్టి మంటలు వస్తాయి అంటూ బిజెపి పార్టీని విమర్శించినట్లుగా ఉంటుంది. కాగా తమిళనాడు బెంగాల్ ఢిల్లీ వంటి ప్రభుత్వాలపై మంటలు రేపుతో అక్కడి ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మనం నిద్రపోతే పెద్ద ప్రమాదానికి గురవుతామని వ్యంగంగా మాట్లాడడం జరిగింది.
మన తెలంగాణలో ఎన్నో వినూత్న మార్పులు చేశామని అవన్నీ ప్రజలు గుర్తు చేసుకోవాలని తెలిపారు. కాగా హైదరాబాద్ 24 గంటల కరెంట్ ఉంటే … ఢిల్లీలో ఆ సదుపాయం ఉండదని ఇంతకన్నా ప్రధానికి పెద్ద పదవి ఉంటుందా అంటూ మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అదే గతికి చేర్చాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం నేను బ్రతికుండగా తెలంగాణకు ఎటువంటి హాని జరగదని ప్రసంగంలో భాగంగా కేసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.