Political తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కూడా ఆహ్వానించింది.. బీఆర్ఎస్‌కు శుభాకాంక్షలు చెబుతూ విజయవాడలో హోర్డింగ్స్ వెలిశాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన తెరాస పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ తీసుకున్న ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ సందడి మొదలైంది. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా విస్తరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయవాడలోని వారధి ప్రాంతంలో భారీ హోర్డింగులు ఏర్పాటయ్యాయి… వీటిలో జై హొ కేసిఆర్ అంటూ నినాదాలతో పాటు కేటీఆర్ హోర్డింగులు కూడా కనిపిస్తున్నాయి.. ఏపీలో బీఆర్ఎస్ హోర్డింగులు ఏర్పాటు కావడంతో వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా వీటిని తిలకిస్తున్నారు..
ఇప్పటివరకు కేసీఆర్ తెరాస తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది.. అయితే ఈ రోజు నుంచి తెరాస పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ రాజకీయ పార్టీగా కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నేతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన కేసీఆర్.. ఇక ఢిల్లీ రాజకీయాల్లోనూ చక్రం తిప్పే దిశగా పార్టీని విస్తరిస్తున్నారు. అయితే తొందర్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు కేసిఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మద్దతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన మరో ప్రాంతీయ పార్టీ కూడా బీఆర్ఎస్ కు మద్దతు పలికింది.