Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా వెళ్తున్నట్టు తెలుస్తుంది..
ఇప్పటికే బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్ బీహార్ పర్యటన ఇందుకు మరింత ఊతమిస్తుంది.. దేశమంతటా కాంగ్రెస్ మిత్ర పక్షాలపైనా గురి పెట్టాడు..ఈ క్రమంలో అన్నాడీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, బీహార్ ముఖ్య నేతలు నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్… లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ వంటి వారిని ఏకం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దేవెగౌడ, కుమారస్వామి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు ఎవరికి అనుకూలంగా ఉంటారు అనే విషయం ఇంకా తెలియలేదు. గత ఎన్నికల సమయంలో బిజెపికి వ్యతిరేకంగా మిత్రపక్షాలను ఏకం చేయాలన్నా కెసిఆర్ ఆలోచన పట్టాలెక్కలేదు.. అయితే ఇప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నా దేశంలో అంతకంతకు బిజెపి పాలన బలపడుతుంది.. వచ్చే సారి లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కి మద్దతు బాగానే లభించేలా ఉంది.. దాదాపు చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం బిజెపి హవా నే నడుస్తుంది మరి ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందనేది తెలియాలంటే 2024 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే