హైదరాబాద్, జూన్ 2023 : శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సతీమణి, నగర సామాజిక వేత్త, ఎడివి ఫౌండేషన్ చైర్ పర్సన్ కావ్య కిషన్ రెడ్డితో పాటు సంఘిని క్లబ్ సభ్యులు బినా మెహతాలు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కావ్యరెడ్డి ప్రదర్శనలో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, వాటి తయారీ గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి లో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ, నేటికి వాటిపై వన్నె తగ్గలెదని అన్నారు. ఈ హ్యాండ్ లుమ్ ఉత్పత్తుల తయారీకి చేనేత కారులు శ్రమ ఎంతో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత ను ఆదరించాలని, అప్పుడే చేనేత కారుల కష్టానికి తగ్గా ఫలితం పరోక్షంగా ఇవ్వగలమన్నారు.
నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. డిజైనర్లు సైతం దేశంలో చేనేత కారులు నేస్తున్న ఈ హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను స్రుజనాత్మకంగా డిజైన్ చేస్తున్నారని కావ్య అన్నారు.