karnataka Politics కర్నాటక పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ పై కేసు నమోదు అయింది. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సాయం చేయాల్సింది పోయి వాళ్లపైన బెదిరింపులకు దిగారు. ఓ భూ వివాదానికి సంబంధించి దళిత కుటుంబాన్ని బెదిరించటంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
కర్ణాటక అసెంబ్లీలోనే మంచి పేరు ఉన్న మనిషి ఆనంద్ సింగ్. ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయన దారుణానికి ఒడిగట్టారు. ఓ హాస్పిటల్ భూమి వివాదంలో తలదూర్చినాయన ఎస్సీ కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా కాల్చపడేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీనితో బెదిరిపోయిన ఆ పేద పేద కుటుంబం ఏం చేయాలో తోచక పోలీసులు ఆశ్రయించింది.
దీంతో, పోలీసులు మంత్రి ఆనంద్ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.