యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది. విడుదల తేదీ తో పాటు మేకింగ్ గ్లింప్స్ ని కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
విక్రమ్ జూన్ 3, 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా “విక్రమ్” కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. #VikramFromJune3 అని కమల్ హాసన్ ప్రకటించారు.
విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్ మహేంద్రన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తారాగణం : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్ , శివాని నారాయణన్ మరియు ఇతరులు
సాంకేతిక సిబ్బంది : దర్శకుడు: లోకేష్ కనగరాజ్, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్,
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్. పి.ఆర్.ఓ.-వంశీశేఖర్.