Kamal Haasan : హాస్య నటిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు కోవై సరళ. తన కామెడీ టైమింగ్ తో మెల్ కమెడియన్స్ ను సైతం ఆమె డామినేట్ చేసేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తెలుగు, తమిళ భాషల్లో వందల్లో సినిమాలు చేశారు కోవై సరళ. అయితే గత కొంతకాలంగా కోవై సరళ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఆమె సినిమాల్లో కనిపించారేమో అనే అనుమానాలు కూడా తలెత్తాయి.
ఈ తరుణంలోనే మరో మూవీతో త్వరలో మన ముందుకు రానున్నారు. కోవై సరళ లీడ్ రోల్ పోషించిన ‘సెంబీ’ మూవీ ట్రైలర్‌ని కమల్ హాసన్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ … కోవై సరళను తాను ఏమని పిలవాలో అర్థం కావడం లేదంటూ అని చెప్పి నవ్వులు పూయించాడు. కోవై సరళ తనతో కలిసి గతంలో పనిచేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ‘‘కోవై సరళని ఇక్కడ ఉన్న వారందరూ అక్క లేదా అమ్మ అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఆమెని నేను ఏమని పిలవాలో నాకు అర్థం కావడం లేదు. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ మూవీలో ఆమె చాలా అద్భుతంగా నటించింది’’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మూవీకి ప్రేమ్ ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహించగా.. అజ్మల్ ఖాన్, రియా సంయుక్తంగా నిర్మించారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇక కమల్ హాసన్ ఇటీవల నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.