Jogi Ramesh : ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికీ పంపి సమస్యలు తెలుసుకుంటున్న నాయకుడు జగన్ మాత్రమే అని మంత్రి జోగి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ… చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు మాట్లాడారు. మరి వారిది తెలుగు బూతుల పార్టీ కాకుండా ఏంటి? అన్నం పెట్టిన తల్లిని, పార్టీ పెట్టిన ఎన్టీఆర్ని తన్నించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని ఏ మాటలతో సంబోధించాలని ప్రశ్నించారు. నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
2024 ఎన్నికలలో ప్రజలు మళ్ళీ టీడీపీని తరిమి కొట్టడం ఖాయం అని జోగి రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజం కాదా అని మంత్రి నిలదీశారు. టీడీపీ బూతులు పార్టీ, జనసేన రౌడీపార్టీ అనేది నిజమే కదా అని అన్నారు. టీడీపీ చచ్చిపోయిన పార్టీ అని… ఆ పార్టీని పాడె మీద మోసుకుని వెళ్తుంటే దాన్ని రక్షించుకోవడానికి చంద్రబాబు అందరి కాళ్లు నాకుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.
బాదుడే బాదుడే కార్యక్రమానికి స్పందనే లేదని వాళ్ల రివ్యూ లోనే తేలిపోయింది. జగన్ని ఢీకొట్టాలంటే చంద్రబాబు బలం చాలదు. 2019 ఎన్నికలలో చంద్రబాబుని ప్రజలు చెప్పుతో కొట్టారు. బట్టలు ఊడదీసి కొట్టిస్తానని చంద్రబాబు ఈ వయసులో మాట్లాడుతున్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుకు అదే జరిగిందన్న సంగతి మర్చిపోయారా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.