Politics గత కొన్ని రోజులుగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా తెరాస పార్టీ జాతీయ స్థాయి పార్టీగా మారడంతో ఈ పార్టీ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చేశారు జెడి లక్ష్మీనారాయణ..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. దీనిపై స్పందించిన ఆయన “నేను ఏ పార్టీలో చేరుతాను అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి ముందు ఢిల్లీకి చెందిన ఆప్ పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను అంటూ వార్తలు వినిపించాయి ఇప్పుడు టిఆర్ఎస్ కోసం వినిపిస్తున్నాయి అలాగే నేను జనసేన పార్టీకి మద్దతిస్తున్నాను అంటూ కూడా కొన్ని రోజులు వార్తలు హల్చల్ చేశాయి అయితే వీటన్నిటిని యూట్యూబ్ ఛానల్ వాటి రేటింగ్ కోసం ఇలా మార్చుకుంటున్నాయి.. గత ఎన్నికల్లో నన్ను విశాఖ ప్రజలు ఆదరించారు అందుకే నేను వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అయితే నా ఆలోచనలతో ఎవరైతే ఏకీభవిస్తారో ఆ పార్టీకి మాత్రమే నా మద్దతు ఉంటుంది అలా ఎవరూ నాతో ఏకీభవించకపోతే నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయడానికి సిద్ధమే ఇండిపెండెంట్గా పోటీ చేసిన అవకాశం ఒకటి ఉంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీలో చేరాలి అనే ఉద్దేశంతో లేను నా ఆలోచనలు నచ్చి నా పద్ధతి నచ్చి వచ్చిన వాళ్లతో నేను కచ్చితంగా ఉండటానికి సిద్ధమే అయితే వారికి నా సిద్ధాంతాలు నచ్చాలి నాకు వారి సిద్ధాంతాలు నచ్చాలి.. ” అంటూ చెప్పుకొచ్చారు..