Janasena : ఏపీలో రాజకీయాలు రోజురోజుకి మరింత వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలోనే జనసేన పార్టీ కూడా వ్యూహాలు, ప్రతివ్యూహాలతో… అధికార వైసీపీని ఢీకొట్టేందుకు సిద్దమవ్తున్నట్లు తెలుస్తుంది. వరుస కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. కాగా ఈరోజు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలకమైన పీఏసీ మీటింగ్ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో పార్టీ భవిష్యత్తు గురించి ఏ విధమైన మార్గనిర్దేశకత్వం చేయబోతున్నారో… అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టు ఇష్యూలో అరెస్టై విడుదలైన జనసేన నాయకులతో.. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇప్పటికే జనసేన, వైకాపా మాటల యుద్ధం నడుస్తున్న వేళ… వైఎస్‌ఆర్ సీపీకి చెందిన కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా సమావేశం అవుతుండటం రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోంది. వైసీపీ లోని కాపు నేతలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీనిపై వైసీపీ కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోమవారం, రాజమండ్రిలోని ఓ హోటల్‌లో వైఎస్‌ఆర్ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశం కానుండటంతో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఒక్కరోజు ముందే, జనసేన పీఏసీ మీటింగ్ జరుగుతుండడంతో పొలిటికల్‌గా వ్యూహాలు మంచి ఊపందుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి 2024 లో ఏ పార్టీ అధికారం లోకి వస్తుందో అని…