గతంలో పవన్ కి దక్కిన పొత్తు సీట్ల సంఖ్య- 24 అంటే ఆరు, ఇప్పుడు వచ్చినవి 21 సీట్లు. అంటే మూడు, ఆరు నుంచి మూడుకు పడిపోయాడు. ఆరు అంటే శుక్రుడు. మూడు అంటే గురుడుగా చెబుతుంది న్యూమరాలజీ. ఇక P. A. W. A. N K. A. L. Y. A. N ని న్యూమరికల్ గా చూస్తే ఆ సంఖ్య ఇదిగో 8+1+6+1+5+ 2+1+3+1+5=33= 6. బేసిగ్గా పవన్ సిక్స్ నెంబర్డ్ గయ్. అంతటి ఉచ్ఛ శుక్రుడి జాతకం కాబట్టే.. అతడి జీవితం నిండా అమ్మాయిలు, పెళ్లిళ్లు, విఫల యత్నాలుంటాయి.
శుక్రుడి నెంబర్ గల వారికి పెళ్లిళ్లు పెద్దగా నిలవవు. ఎందుకంటే శుక్రుడు అంటేనే స్త్రీ భోగ కారకుడు. శుక్రుడు బాగున్న వారికి సోకులు ఎక్కువ. తద్వారా.. వారికి అమ్మాయిలు పడ్డం కూడా అంతేగా ఉంటుంది. ఈ క్రమంలో పవన్ కి కలిసొచ్చే నెంబర్ ఎటు నుంచి ఎటు చూసినా ఆరు. ఈ ఆరు అతడికి ఇవ్వాల్సిన సుఖభోగాలన్నిటినీ ప్రసాదిస్తుంది.
ఎందుకో తెలీదు ఈ నెంబర్ కాదని ఆయన 21కి షిఫ్ట్ అయ్యారీ ఎన్నికల వేళ. 21 దేవగురువు బృహస్పతికి సంబంధించినది. గురువు రాజయోగ కారకుడే కాదనడం లేదుగానీ.. ఈయనేమో దేవతల గురువు. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నదేమో రాక్షస గురువు ఆధీనంలో. ఈ ఇద్దరికి పొంతన కుదురుతుందా? అంటే అస్సలు కుదరదు. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డం అంటారు. ఒకరు రాక్షసుల్ని హతమార్చే తారక మంత్రం నేర్పితే.. మరొకరు ఆ చనిపోయిన రాక్షసులను ఎలా బతికించాలో నేర్పేవారు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న ఈ ముద్దుల పవనుడి పరిస్థితి ఏంటి? అంటే బండి సున్న.
సరే రెండు ఎంపీ సీట్లను కలుపుకుంటే వచ్చే ఆ సంఖ్య 23. ఐదు. ఇది బిజినెస్ నెంబర్. ఈ బిజినెస్ నెంబర్ కి అధినాయకుడు బుధుడు. బుధుడికి గురువుకూ అస్సలు పడదు. ఎందుకంటే బుధుడికి గురువు తండ్రే. కానీ అసలు తండ్రి చంద్రుడు. గురువు దగ్గర పాఠాలు నేర్చుకోడానికి వచ్చిన చంద్రుడు.. ఆయన భార్య ప్రేమలో పడి.. పుత్ర సంతాన భాగ్యం ప్రసాదిస్తాడు. ఆ భాగ్యమే బుధుడు.
బుధుడు ప్రధానంగా ఉన్న వారికి తండ్రి అంటే అస్సలు గిట్టదు. కారణం.. తాను టెక్నికల్ గా ఒకరి కొడుకు. అసలుకు చూస్తే మరొకరి పుత్రుడు. ఈ రెండు బేధాభిప్రాయల కారణంగా.. వీరు తమ తమ తండ్రిని అస్సలు పరిగణలోకి తీసుకోరు. అంటే ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ కలిపితే(21+ 2= 23=5) వచ్చే ఐదో అంకె కూడా ఏమంత కలిసి రావడం లేదు. దీన్నిబట్టీ చూస్తే.. ఇప్పటి వరకూ పాటించిన న్యూమరాలజీ లెక్కలకు ఇది ఎంత మాత్రం సరిపోవడం లేదు.
ఇక పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సందర్భంగా చేస్తున్న ఎంపీ స్థానానికి పోటీ.. అది కూడా కాకినాడ నుంచి.. జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే.. ఇక్కడొక వ్యవహారం.. చిక్కుముడికి సరైన సమాధానం లభిస్తుంది. ఇటీవల భువనమ్మ ఒక మాట అన్నది.. కావాలంటే మీరు గుర్తించవచ్చు. అదేంటంటే.. బాబుగారికి రెస్ట్ ఇద్దామని. అలాగని అదేం ఊరకే అన్నమాట కాదు.. ఒక వేళ గెలిస్తే.. మొదట చూచాయగా బాబు సీఎం అయినా ఓ ఆర్నెల్లు గడిచాక.. ఆయన అనారోగ్య సమస్యలను బూచిగా చూపించి (నాకెలాంటి మానసిక శారీరక సమస్యల్లేవు తమ్ముళ్లూ! అంటూ.. ఆయన స్వయం ప్రకటనలు గుప్పించుకున్నా సరే) పదవి నుంచి దింపేసేందుకు ఎక్కువ ఛాన్సుంది.
ఆ ప్రధాన ఘట్టం పూర్తయ్యాక మొదలవుతుంది యువరాజ పట్టాభిషేకం. అదిగానీ జరిగితే.. మనకిక్కడ రెండున్నరేళ్ల అధికార పీఠం.. ఫిఫ్టీ- ఫిఫ్టీ అనడానికొకడు ఉండకూడదు. దీన్నిబట్టీ కాకినాడలో ఒక సర్వే(అది ఒరిజినలా కాదా అటుంచితే) ఇక్కడ పవన్ ఎంపీగా గెలుపు సులువు అనేలాంటిదొకటి తయారు చేసి.. తద్వారా.. ఆయన్నలా ఉసిగొలిపితే.. వాళ్లన్నల్లాగా.. కేంద్రమంత్రి పదవనే బిస్కెట్ కూడా పడేస్తే.. ఇక అటు నుంచి ఒక తలనొప్పి ఉండదు. ఇటు నుంచి ఆల్ హ్యాపీస్. తల్లీకొడుకుల కల ఇట్టే నెరవేరినట్టే.
అహే.. ఊకో కాకా.. అంటారేమో.. ఇలాంటి వాటికే ఇక్కడ అవకాశాలు మెండు. కారణాలేంటని అంటారేమో.. ఒక ముఖ్యమంత్రి కూతురు\ ఒక ముఖ్యమంత్రి భార్య\ ఒక ముఖ్యమంత్రి తల్లి అనిపించుకోవాలని ప్రగాఢంగా వాంచిస్తోన్న భువనమ్మకు ఈ మాత్రం ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? ఈ అరుదైన ఘనత కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఒక్కరికే ఉండటం. అందుకే కొడుకు చేత వంగి వంగి దండాలను పెట్టిస్తోందని అంటారు నిపుణులు(మొన్నటి కదిరి సభలోని ఫోటో ఇందుకు సాక్షి).
వీటన్నిటిలోంచి చూస్తే.. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ బరి నుంచి తప్పించడమే సబబు అన్న ఈక్వేషన్లు తెర మీదకొస్తున్నాయ్. దానికి తోడు ఆయనకున్న రాజకీయ దరిద్రం ఉండనే ఉంది. ఆయన ఆ మాత్రం పోటీకి వచ్చే అవకాశాలు కూడా బాగా తక్కువేగానీ.. ఏది ఏమైనా.. పవన్ని సైనికులు ఫీలవుతున్నట్టు రాన్రాను తగ్గించడంలో టీడీపీ దాని వైఫైలా అల్లుకుని ఉండే కమ్మనైన రాజకీయ మాఫియా..(ఓవర్ గా ఫీలవకండి… ఉన్న విషయమే అంటుంట) ఏమంత తక్కువగా వర్కవుట్ చేయడం లేదు.
డాక్టర్ కోరుకున్నట్టు పేషెంట్ ఎలా కోపరేట్ చేస్తాడో.. సరిగ్గా అలాగే కోపరేట్ చేస్తూ.. తన ఒక్కో అవయవాన్ని కోల్పోతున్న పవన్ కళ్యాణ్ ని చూసి.. జనసైనికుల మనో వ్యధ మాటల్లో వర్నించలేనిది. ఇప్పటికే సీట్ల సంఖ్య తరుగుదల. దీనికి తోడు దశాబ్ధం పైగా.. జెండా మోసిన సైనికులను పక్కన పెట్టి.. సైకిలిస్టులను చేర్చుకుని.. వాళ్లకు టికెట్లిస్తుండే.. వీటన్నిటిని బట్టీ చూస్తుంటే.. అసలు జనసేన అన్నదొక పార్టీనా లేక.. పవర్ బ్రోకర్ హౌసా.. అన్న కామెంట్లు.. ఏకంగా ఆయన కరడుగట్టిన వీరాభిమానుల నుంచే వినిపిస్తుంటే.. వినడానికే చాలా చాలా కర్ణకఠోరంగా ఉంది.. ఇవన్నీ భరిస్తూ.. ఆ సేనాని ఎంత ప్యాకేజీల కోసం పాకులాడినా.. ఎంత గుండె దిటువు చేసుకుని బతుకుతున్నాడో కదా అనిపించక మానదు.
ఒక వేళ ఈయన పార్లమెంటుకెళ్లి.. నాదెండ్ల అసెంబ్లీకెళ్తే.. ఒక వేళ ఇస్తేగిస్తే.. ఉప ముఖ్యమంత్రిత్వం ఎవరికిస్తారు? ఆయనకేగా.. ఇదిలా ఉంటే.. వచ్చే రోజుల్లో నాదెండ్ల తన వంశాచారం ప్రకారం.. ఈ మాత్రం రాజకీయ పార్టీ ని కూడా లాగేసుకుంటే.. పవన్ కళ్యాణ్ తట్టుకోగలడా? అ. హ ఒక అనుమానం. బాప్ రే.. పగోడికి కూడా ఈ పనికిమాలిన పవర్ బ్రోకరిజం వద్దురా బాబూ.. అన్న మాట చాలా మంది సైనికులు పైకి అనడం లేదు కానీ లోలోన కుమిలికుమిలి పోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఏమంటారు ???
ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది