తెలంగాణ జనసైనికులు ఇదే మా పిలుపు – తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్ సాగర్
తేదీ : 12//03/2025 హైదరాబాద్ : పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ నిర్వహిస్తున్న ‘జయకేతనం’ సభ దేశ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తెలిపారు.
ఈ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు తరలిరానున్నారని… ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల, ఢీల్లి నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరిగే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని సాగర్ తెలిపారు.
తెలంగాణ లోని అనేక ప్రాంతాలు నుండి వచ్చే జన సైనికులు, వీర మహిళలు క్షేమంగా వచ్చి సభ పూర్తి అయిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని… సభా ప్రాంగణంలో తమకు ఏర్పాటు చేసిన ప్రాంతంలో క్రమశిక్షణతో మెలిగాలని సూచించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు జనసేనకు అఖండ విజయాన్ని అందించారని… పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని, ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని ఆయన కొనియాడారు.