తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలకు జై స్వరాజ్ సిద్ధం అవుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి పదేండ్లు దాటిన ఇంకా మౌలిక సదుపాయాలైన విద్యా వైద్య ఉపాధి ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రభుత్వ చేపట్టలేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ మాయమాటలతో కాలయాపన చేస్తే, పచ్చి అబద్ధాలతో వచ్చే ఐదేళ్లు వెళ్లబుచ్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోందని కేఎస్ఆర్ గౌడ్ వివరించారు. హైదరాబాద్లోని మెట్టు గూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టలేదని, ఎన్నికలు, బడ్జెట్ తదితర కారణాలు చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని కేఎస్ఆర్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం జనానికి తేటతెల్లం చేయడానికి త్వరలో ఒక కార్యాచరణ చేపడుతున్న ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను కేఎస్ఆర్ గౌడ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు గోలుకొండ రత్నం, పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుషరాములు గౌడ్, పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామిని లక్ష్మీ, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రామ్మూర్తి, పార్టీ రాష్ట్ర నాయకుడు సుగూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.