Political : ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను ప్రభావంతో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు భారీగానే పడనున్నట్టు తెలుస్తుంది.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మీడియాతో సమీక్ష నిర్వహించి తుఫాను పరిస్థితులపై మాట్లాడారు..
రాష్ట్రంలో రాబోతున్న మాండోస్ తుఫాను ప్రభావం పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఏవిధంగా ఉండని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.. అలాగే ఈరోజు తమిళనాడు వద్ద తుఫాను తీరం దాటన ఉందని ఈ సమయంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని అందుకే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ తెలిపారు ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అవసరమైతే వెంటనే వారిని వేరే ప్రదేశాలకు తరలించాలని అన్నారు..
ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పునరావాస శిబిరాలను తెరవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల వారికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.. అలాగే ఇప్పటికే వేటకు వెళ్లిన తిరిగి తీరని ఆదేశాలు జారీ చేయమని తెలిపారు జగన్ ఎవరు కూడా సందులు తీరాలకు వెళ్లకుండా వేటకు మత్సకారులు వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేయాలంటూ అధికారులను సూచించారు.