Health గర్భం దాల్చిన దగ్గర్నుంచి తల్లిని ఎన్నో రకాల ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏమి తినకూడదు మందులు ఎక్కువగా వేసుకోవచ్చా లేదా ఇన్ని స్కానింగ్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? తాము చేస్తున్న బండ్లన్నీ సక్రమంగానే ఉన్నాయా వంటి ఎన్నో రకాల ప్రశ్నలు తలలో తిరుగుతూ ఉంటాయి అయితే అందులో ముఖ్యంగా గర్భం దాల్చిన వెంటనే ఐరన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు డాక్టర్లు అయితే ఈ మధ్యకాలంలో ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల పుట్టే బిడ్డ నల్లగా పుడతారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే ఇందులో నిజం అనేది ఒకసారి చూద్దాం..
ఐరన్ టాబ్లెట్లు సిసోకి తల్లికి చాలా అవసరం తల్లికి రక్తహీనత ఉంటే బిడ్డ మానసిక శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండదు ముఖ్యంగా మెదడు వెన్నుపూస వంటి ముఖ్యమైన అవయవాలు ఏర్పాటులో ఇనుము ప్రాధాన్యత చాలా ఉంటుంది అలాగే డెలివరీ సమయంలో తగినంత రక్తం లేకపోతే హైరిస్క్ డెలివరీగా మారి తన ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది.. అలాగే బిడ్డకు దీర్ఘకాలం వేధించే చాలా సమస్యల నుంచి రక్షణగా ఇవి ఉపయోగపడతాయి.. అందుకే ఐరన్ టాబ్లెట్లు వాడటం తప్పనిసరి అయితే ఈ టాబ్లెట్లు వాడటం వల్ల పుట్టే బిడ్డ రంగులో ఎలాంటి మార్పు ఉండదు ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్లు అనేవి బిడ్డ రంగుని అస్సలు నిర్ణయించకు అందుకే ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం మంచిదని హెచ్చరిస్తున్నారు గైనకాలజిస్ట్..