శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై నిర్మాత కెకె రాధామోహన్ తమ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మిర్నా మీనన్ ను ఆహ్వానించారు. గతంలో మలయాళం, తమిళం లో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్ లు ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది.
సాంకేతిక బృందం విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధృవన్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. గిడుతూరి సత్య ఎడిటింగ్, కొలికపోగు రమేష్ ఆర్ట్, రామకృష్ణ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.