Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలోనే పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. సుకుమార్ మేకింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ అందించిన మ్యుజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది పుష్ప మూవీ టీమ్.
గత ఏడాది రిలీజ్ అయిన ‘పుష్ప – ది రైజ్’ మూవీ ఊహించని విధంగా రికార్డుల్ని తిరగరాసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ కలెక్షన్ల మోత మోగించేసింది ఈ చిత్రం. ఆ మూవీలో అల్లు అర్జున్ మేనరిజానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వాస్తవానికి ‘పుష్ఫ- ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరులోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. కానీ నవంబరు 13 నుంచి షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు తేదీతో సహా వార్త బయటికి వచ్చింది.
ఈ మేరకు ఇప్పటికే ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబ సెట్స్‌లో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఒక ఫొటోని షేర్ చేశాడు. గత ఆదివారమే టెస్ట్ షూట్ ప్రారంభమైందని… ఈ నెల 13 నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ఫ- ది రూల్’కి సంబంధించి పూర్తి స్క్రిప్ట్‌ని ఇప్పటికే దర్శకుడు సుకుమార్ సిద్ధం చేసినట్లు చిత్ర యూనిట్ చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన ‘పుష్ప – ది రైజ్’ మూవీ… కేవలం హిందీలోనే రూ. 100 కోట్లు రాబట్టడం గమనార్హం. దీంతో పుష్ 2 పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.