Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు సెట్లోకి వస్తారా? ఎప్పుడు కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేస్తారా అని వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు అంతా. ఓ పక్క అభిమానులు, మరో పాక్ అదిరెక్టర్స్, నిర్మాతలు. షూటింగ్స్ స్టార్ట్ చేశారుకదా అని షెడ్యూల్స్ వేసుకుని సార్ సెట్లోకి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తుంటే ఫస్ట్ ఫేజ్ పొలిటికల్ టూర్ వారాహి యాత్ర స్టార్ట్ చేశారు. 15 రోజుల పాటు యాత్ర కంప్లీట్ అయ్యాక టూర్ కి బ్రేక్ ఇచ్చి షూట్ లో జాయిన్ అవుతారని అనుకున్నారు అంతా.
ఫస్ట ఫేజ్ వారాహి యాత్ర కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ సెకండ్ వీక్ నుంచి షూట్ లో జాయిన్ అవుతారని, ఉస్తాద్, ఓజీ సినిమాల్లో దేనికి షూటింగ్ కి వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ మొత్తానికే సీన్ రివర్స్ అయ్యింది. నేడు జులై 9 నుంచి పవన్ పొలిటికల్ యాత్రం రెండో ఫేజ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రజెంట్ మూడు సినిమాలున్నా అర్జెంటుగా కంప్లీట్ చెయ్యాల్సినవి మాత్రం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.
ఆల్రెడీ ఓజీ 50 పర్సెంట్ కంప్లీట్ అయినా ఇందులో పవన్ కళ్యాణ్ 2 వారాలు షూట్ చేశారు. దీనికి సంబందించి ఇంకా 3 వారాలు షూట్స్ చెయ్యాల్సి ఉందని సమాచారం. కానీ సెకండ్ ఫేజ్ యాత్ర స్టార్ట్ చెయ్యడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్టే. డిసెంబర్ ఎండ్ కి రిలీజ్ అనుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కూడా లేట్ అయ్యే చాన్సుంది.