Ravi Teja-Trinadha Rao Nakkina:కమర్షియల్ ఎంటర్‌టైనర్లు తెరకెక్కించడంలో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) నెక్ట్స్ ప్రాజెక్ట్ దాదాపు కన్‌ఫర్మ్ అయిపోయింది. ‘ధమాకా’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. తదుపరి మూవీ కూడా రవితేజతోనే చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ధమాకా’ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన రైటర్ మాత్రం ఈ సినిమాకు పనిచేయడం లేదు.
డైరెక్టర్ నక్కిన త్రినాథ రావుకు (Trinadha Rao Nakkina) టాలీవుడ్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ‘మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, నేనే లోకల్’తో పాటు రీసెంట్‌గా ‘ధమాకా’ మూవీతో దర్శకుడిగా సత్తా చాటారు. ప్రత్యేకించి ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేస్తూ కమర్షియల్ మూవీస్ తెరకెక్కించడంలో ఆయన మార్క్ చూపిస్తు వస్తున్నారు. దీంతో ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్క ప్రాజెక్ట్ కూడా మెటీరియలైజ్ అవలేదు. ఈ నేపథ్యంలోనే మాస్ మహరాజ్ రవితేజ (Ravi Teja) మరోసారి త్రినాథ రావుకు చాన్స్ (Dhamaka Offer) ఇచ్చినట్లు తెలుస్తోంది. తను చెప్పిన స్టోరీకి రవితేజ ఫిదా అయినట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు రైటర్ గురించిన ట్విస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.
త్రినాథరావు టాలెంటెడ్ డైరెక్టర్ అయినప్పటికీ.. ఆయన రూపొందించిన గత మూడు చిత్రాలకు కథ అందించింది మాత్రం ప్రసన్న కుమార్ బెజవాడు. ఇండస్ట్రీలో వీరిది హిట్ కాంబినేషన్‌గా ముద్రపడిపోయింది. అయితే, ప్రస్తుతం రవితేజతో త్రినాథ రావు తీయబోయే సినిమాకు ప్రసన్న రైటర్‌గా పనిచేయడం లేదు. ఈ చిత్ర కథ కూడా స్వయంగా డైరెక్టరే అందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజకు ఆయన చెప్పిన కథ విపరీతంగా నచ్చేసిందట. దీంతో త్రినాథ రావుకు సినిమా గ్యారంటీ అని తెలుస్తోంది.