Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి వెండితెర పై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పై అందరిలో భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా గురించి కొన్ని వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుందట. ఇక స్టోరీ విషయంలో.. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ అని, సోషల్ ఫాంటసీ మూవీ అని గాసిప్స్ వస్తున్నాయి. అయితే అవేవీ కాదని మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని ఆ స్టోరీలైన్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చి రెండు పార్ట్‌లుగా తీయాలనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దళపతి సినిమాలా ఈ కథ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.
ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది.