Health వంటకాల్లో ఇంగువ ఉపయోగిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది ముఖ్యంగా తాలింపు విషయంలో ఇంగువకి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది పులిహార తాలింపులో ఇంగువ లేకపోతే అస్సలు ఊహించలేము అయితే అలాంటి ఇంగువ రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని తెలుస్తోంది..
ఇంగువను ఎన్నో ఏళ్లుగా వంటకాల కోసమే కాకుండా ఆయుర్వేద మెడిసిన్ లో కూడా ఉపయోగిస్తున్నారు.. ముఖ్యంగా తాలింపుల్లో ఇంగువ వేస్తే ఆ రుచి అమోఘంగా ఉంటుంది.. దీనిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి రోజు వంటకాల్లో ఇంగువను ఉపయోగించడం వల్ల జీర్ణాశయ సమస్యలు దూరం అవుతాయి అలాగే ఎవరికైతే అజీర్తి సమస్య ఉంటుందో అలాంటివారు గ్లాసు మజ్జిగలో చిటికెడు ఇంగువ వేసుకొని తాగితే ఫలితం ఉంటుంది.. అలాగే దీనిలో ఉండే కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇంగువలో ఫైబర్, ప్రొటీన్స్ , కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరటిన్, బి – విటమిన్, వంటి పోషకాలూ ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. కడుపులో మంట ఉబ్బరం వంటివి ఉన్నవారు కూడా ఇంగువను ఎక్కువగా తీసుకోవచ్చు దగ్గు ఆస్తమా వంటి సమస్యల నుంచి కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.. అలాగే ఆకలి లేనివారు ఇంగువను తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి దూరం కావచ్చు అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా ఇంగువను తరచూ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది..