Viral Video దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎందరో సైనికులు పోరాడుతున్నారు వీరంతా చలికి ఎండకి తట్టుకొని దేశ రక్షణకై పాటుపడుతున్నారు దేశమంటే గౌరవం మాతృదేశం పై వారికున్న మమకారమే ఈ నిబద్ధతకు కారణం అయితే కేవలం సైనికులే కాదు జాగిలాలు కూడా దేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పాటుపడుతున్నాయి ఇలాంటి ఓ సంఘటనే తాజాగా జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకుంది…
తాజాగా జమ్మూకాశ్మీర్లో మన భారతీయ సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది అయితే ఇందులో ప్రాణాలు తెగించి ఓ జాగిలం చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. సైనిక శిక్షణలో రాటుదేలిన ఓ ఆర్మీ డాగ్ తన వృత్తి ధర్మాన్ని ఎంతో నిబద్ధతతో పూర్తి చేసి శభాష్ అనిపించుకుంది ఉగ్రవాదులను గుర్తించే క్రమంలో తన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లిన లెక్కచేయకుండా వారిని వెంటాడి పట్టుకుంది.. ఆ తెగువతో ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా తంగపావా ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి.. ఆర్మీకి చెందిన చీనార్ కార్ప్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు జూమ్ అనే జాగిలాన్ని రంగంలోకి దించగా ఓ ఇంట్లో నక్కీ ఉన్నా ముష్కరులను కచ్చితంగా కనిపెట్టింది ఈ జాగిలం.. ఉగ్రవాదులపై సింహంలా దూకి దాడిచేసింది. దీంతో ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరుపగా రెండు తూటాలు దాని శరీరంలోకి దూసుకెళ్లిన పట్టించుకోకుండా ఉగ్రవాదులపై దాడి చేసింది.. ఇంతలా అక్కడికి చేరుకున్న సైన్యం వారిని మట్టు పెట్టింది ఎందుకు ముందు ఎన్నో ఆపరేషన్స్లో జూమ్ తన పనిని చాలా కచ్చితంగా పూర్తి చేసిందని ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకుంటుందని అధికారులు తెలిపారు..
#WATCH | In an operation in Kokernag, Anantnag, Army's dog 'Zoom' attacked terrorists & received 2 gunshot injuries. In spite of that, he continued his task which resulted in neutralisation of 2 terrorists. The canine is under treatment in Srinagar, J&K.
(Source: Chinar Corps) pic.twitter.com/D6RTiWqEnb
— ANI (@ANI) October 10, 2022