Bhakthi భగవద్గీత అందరూ ఎలా బతకాలో సూచించే ఒక ఉత్తమమైన మార్గం ఎన్నో ఏళ్ల నుంచి మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్న గీతలో ముఖ్యంగా ఇతరులను అనుకరిస్తూ బ్రతికే కంటే నిన్ను నువ్వు నమ్ముకుని బతకడం ముఖ్యమని చెబుతూ ఉంది అలాగే ఈ భగవద్గీతలో ఉన్న మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే..
శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత ఈ కాలంలో మనుషులు ఎలా బతకాలో కూడా చెబుతుంది ప్రతి ఒక్క విషయానికి భగవద్గీతలో సమాధానం ఉంటుందని చెబుతున్నారు గీతను చదివిన ఎందరో మహానుభావులు.. అలాగే మనిషికి మార్గనిర్దేశం చేయటంలో ఎన్నో సమస్యల్లో ఉన్న మనిషిని ఒక వడ్డీకి తీసుకురావడానికి భగవద్గీత ఎంతగానో సహాయం చేస్తుంది అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న ఎందరో భగవద్గీత తమకు మార్గం నిర్దేశమని ఇప్పటికే పలమార్లు చెప్పుకొచ్చారు అయితే ఇందులో ఏముందంటే..
శ్రద్ధగా పని చేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు – భగవద్గీత.
ప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు. వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది – భగవద్గీత.
కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే మిగులుతుంది – భగవద్గీత.
నీ తప్పు లేకున్నా.. నిన్ను ఎవరైనా బాధపెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాతకాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది – భగవద్గీత.
విశిష్టమైన గుణం, శోభ, శక్తి కలిగింది ఏదైనా సరే.. అది నా తేజము నుంచే ఆవిర్భవించిందని తెలుసుకో – భగవద్గీత.