Bhakthi దసరా వచ్చేస్తోంది. వాడవాడలా… భక్తిశ్రద్ధలతో అమ్మవారి రూపాలను నెలకొల్పుతుంటారు. మిగతా సంస్కృతులకు భిన్నంగా హిందూ ధర్మంలో మహిళా రూపిణి అయిన అమ్మవారికి విశేష శక్తులుంటాయని నమ్మతుంటారు. అందుకే ఆమెకు మహాశక్తిశాలినీగా, సృష్టికి మూలంగా భక్తులు కొలుస్తుంటారు. అలాంటి అమ్మవారుకి అలంకరించిన చీరల్ని…దసరా శరన్నవరాత్రులు ముగిసిన తర్వాత వేలంగా భక్తులకు అందిస్తుంటారు. భక్తులు సైతం… అమ్మవారి చీరల్ని అంతే భక్తితో వేలంలో దక్కించుకుంటుంటారు. మరి వీటిని ధరించ వచ్చా..? ధరిస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించారని అని చాలా మంది సందేహిస్తుంటారు..?
సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారికి అలంకరించు వస్త్రాల్ని… శేష వస్త్రంగా పిస్తుంటారు. వీటిని వేలం వేయడం లేదా ధర కట్టి అమ్మడం సాధారణంగా జరుగుతుంటుంది. వీటిని సాధారణ భక్తులు ఎలాంటి సందేహాలు లేకుండా ధరించవచ్చని సూచిస్తున్నాయి… మన ధర్మ గ్రంథాలు. అయితే ఈ వస్త్రాల్ని ఇష్టారాజ్యంగా కాకుండా… కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు… పెద్దలు. అవేంటంటే… ఈ చీరల్ని శుక్రవారం నాడు మాత్రమే ధరించాలి. అలాగే…. ఈ చీరల్ని ధరించినప్పుడు… కోపతాపాలు, పగలు ప్రతీకారాలు అంటూ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే భగవన్నామ స్మరణ చేయడం ఉత్తమం అంటున్నారు. ఈ వస్త్రాల్ని రాత్రి వేళల్లో ధరించకూడదు… వీటిని ఉతికినప్పుడు నీళ్లను ఎక్కడపడితే అక్కడ పోయకుండా…. పచ్చని మొక్కలకు మాత్రమే పోయాలని చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన నెలసరి సమయాల్లో ఈవస్త్రాల జోలికి వెళ్లకూడదు. ఈ నియమాలు పాటించడం ద్వారా.. ఆ అమ్మవారి కృపకు నోచుకోవచ్చని చెబుతున్నారు… పండితులు.