Bhakthi ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఈ దీపారాధన రోజుకు రెండుసార్లు చేయటం తప్పనిసరి ఉదయం సూర్య దయానికి ముందు, సాయంకాలం సూర్యాస్తమయం కాలంలో చేసే దీపారాధన అత్యంత ఫలితాలను ఇస్తుంది.. ఇంట్లో, వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా ఈ దీపారాధన చేయటం ఎల్లవేళలా శుభదాయకం.
దీపారాధన అంటే ఆ పేరులోనే ఉంది దీపాన్ని పూజించటం అని. ఈ దీపాన్ని సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంగా తలచి పూజిస్తారు.. దీపంలోనే దేవతలందరూ కొలువై ఉంటారు అని హిందూ సాంప్రదాయం చెప్తుంది. ప్రతి మనిషిలో కూడా ఒక దీప జ్వాలా వెలుగుతూనే ఉంటుంది. మనిషి ప్రాణంతో ఉన్నంతవరకు ఈ జ్వాల మండుతూనే ఉంటుంది. నిత్య దీపారాధన ఆ ఇంటికి ఎంతో శ్రేయస్కరం.. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే దీపం వెలిగించి.. ఆ దీపానికి నమస్కరించాలి. దీపాన్ని నేరుగా వెలిగించకుండా అగర్బత్తితో వెలిగించాలి..
ఈ దీపారాధనలో ప్రత్యేక నియమాలంటూ ఏమీ పాటించక్కర్లేదు. దీపాన్ని నేరుగా నేలపై ఉంచరాదు.. ఒక చిన్న ప్లేట్ లో దీపాన్ని ఉంచవచ్చు. ఉదయం, సాయంకాలం సమయాల్లో స్నానం చేసిన వెంటనే ఈ దీపారాధన చేసుకోవచ్చు. దీపపు కుందే బంగారంతో కానీ, వెండితో కానీ, ఇత్తడితో కానీ, మట్టితో కానీ చేసి ఉండొచ్చు. ఒక ఒత్తుతో చేసే దీపారాధన అనేది అంత శుభకరం కాదు. అందుకే దీపారాధన రెండు వత్తులతో చేయాలి.. ఆవు నెయ్యితో రెండు దీపాలను వెలిగించడం అత్యంత శ్రేయస్కరం..