Health కిడ్నీ క్రియేటినిన్ చాలామందికి తెలియనిది. చాలా సాధారణంగా కనిపించే క్రియేటినిన్ ఈ మాత్రం ఆలస్యం చేసిన కిడ్నీలు పడిపోయే ప్రమాదం వుంది.
మూత్ర సమయంలో ఇబ్బందిగా, ఎప్పుడూ అలసటగా అనిపించినా శరీరంలో క్రియేటిన్ లెవెల్స్ పెరిగాయేమో చెక్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్య అనేది వేసవికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు ఈ క్రియేటివ్ లెవెల్స్ అనేవి బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. సరిగ్గా నీరు తీసుకోకపోయినా క్రియేటినిన్ బాడీలో పెరిగి అనేక సమస్యలు వస్తాయి. ఎక్కువ ప్రొటీన్‌లు తీసుకునే వ్యక్తులు, అధిక బిపి కలిగిన వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ కూడా క్రియేటినిన్ స్థాయిలను పెంచుతుంది.
క్రియాటినిన్ పెరిగిపోయినప్పుడు శరీరంలో మూత్రపిండాల మీద దాని ప్రభావం అనేది కనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో ఇవి పెరిగితే మూత్రపిండాలు పని చేయడం మానేసి స్థితికి కూడా వెళ్లిపోతాయి. తొందరగా వీటిని కనిపెట్టి చికిత్స తీసుకోకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రియాటినిన్ అనేది శీరరంలో పేరుకుపోయే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన, మలం ద్వారా బయటకు వెళతాయి. కానీ, క్రియేటినిన్ అనేది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లకుండా.. శరీరంలో పేరుకుపోతూనే ఉంటుంది.