పెళ్లయిన 6 ఏళ్ల తర్వాత తన భార్య ఓ మగాడని గుర్తించాడు ఓ భర్త. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి మురైనాకు చెందిన అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నాటి నుంచి ఆమె తన భర్తను తాకనిచ్చేది కాదు. దాదాపు 6 ఏళ్లు వారిద్దరూ శారీరకంగా ఒకటవ్వలేదు. ఆమెతో విసిగిపోయిన భర్త ఆమెను అనుమానించాడు. వైద్య పరీక్షలు చేయించాడు. రిపోర్ట్స్ చూసి నివ్వెరపోయాడు. ఇన్నాళ్లు ఆయన కాపురం చేసింది ఓ మగాడితో అని తెలిసి షాక్ అయ్యాడు. తమకు పెళ్లి చేసిన ఆమె తండ్రి, భార్య మీద ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు వారి పెళ్లిని రద్దు చేసింది.