Crime మనుషుల్లో కురోరత్వం రోజురోజుకి శృతిమించి కోరుతుంది హత్యలు మానభంగాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అలాగే కట్టుకున్న భార్యనే కడతేర్చే రోజులు వచ్చాయి అలాగే భార్యలు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల్ని చంపేస్తున్నారు అయితే ఇక్కడ ఏ కారణం లేకుండా తన భార్యను చిత్రహింసలు పెట్టిన ఘటన తాజాగా చోటుచేసుకుంది..
సాధారణంగా ఎవరికైనా కోపం వస్తే ఏం చేస్తాం కాసేపు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అటు ఇటు తిరుగుతాను అదే ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తే ఇంకా ఏమీ అనకుండా ఊరుకుంటాం కొన్నిసార్లు కూడా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహార పదార్థాలు బాలేదని వారి మీద కోప్పడుతూ ఉంటాను అది ఇంట్లో బాలేక పోతే చెప్పి ఊరుకుంటాం.. కాని ఇంట్లో తినే ఆహారంలో వెంట్రుక వస్తే చాలామంది సర్ధుకుపోతుంటాం. కాని ఓ భర్త మాత్రం భోజనంలో తల వెంట్రుక వచ్చిందని కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు. భోజనం చేస్తుండగా ఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపంతో భార్యపై వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు.. భర్త, అత్తమామలు కలిసి ఆ మహిళకు గుండు కొట్టించారు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది. మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు.