Health సంతాన లేమి సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు, ఉష్ణోగ్రతలు కారణంగా చాలా మంది దంపతులు పిల్లలను కనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లోనూ పిల్లలు కలగకపోవడానికి కారణం.. కేవలం మహిళల లోపాలే చూపిస్తాం. పురుషుల స్పెర్మ్ కౌంట్, నాణ్యత కూడా.. సంతానలేమి సమస్య కూడా ఓ ప్రధాన కారణం.
సాధారణంగా మిల్లీలీటర్ వీర్యానికి 15 మిలియన్ల కంటే తక్కువ వీర్యకణాలు ఉన్న పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తారు ఆరోగ్య నిపుణులు అలాగే తక్కువ స్పెర్మ్ కౌంట్, నాణ్యతలేని వీర్యం వల్ల పిల్లలు కలగడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఇది తర్వాత వారి లైంగిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది.. అయితే వీర్యకణాల సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణాలు వృషణాల్లోని సిరల వాపు, అంటూ వ్యాధులు, హార్మోన్ల సమస్యలు.. వీటితోపాటు మారిపోతున్న జీవనశైలి కూడా ఒక కారణం మద్యం సేవించడం ధూమపానం చేయడం సరైన జీవనశైలి లేకపోవడం సమయానికి తిండి నిద్ర లేకపోవడం వంటి ఎన్నో కారణాలు మగవారి లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.. అలాగే పురుషులకు, మహిళలకు విటమిన్ డి చాలా అవసరం. ఎందుకంటే ఇది సంతానోత్పత్తి సమస్యలను తగ్గిస్తుంది. అయితే వీటి సంఖ్య పెరగాలి అంటే.. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.. దీని వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.. మద్యపానాన్ని తగ్గించడం, ధూమపానాన్ని మానేయడం, బరువును అదుపులో ఉంచడం వల్ల స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి పెరుగుతుంది.