Health చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తూ ఉంటుంది అయితే ఈ రోజుల్లో నిద్ర సరిగా పట్టకపోవడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి అయితే అవి ఏంటో వాటికి పరిష్కారాలు ఏంటో ఒకసారి చూద్దాం..
నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా రాత్రి చాలా సమయం వరకు ఫోన్ చూస్తూ ఉండటం కూడా మరొక ముఖ్య కారణం.. ప్రతి ఒక్కరిని నిద్రకు దూరం చేసే ఏకైక కారణం ఫోన్లో టీవీలు వీటిని వీలైనంత దూరంగా ఉంచాలి. వీటిని ఉండు వచ్చే బ్లూ రేస్ నిద్రను దూరం చేస్తాయి అందుకే పడుకోవడానికి కనీసం గంట ముందు ఫోన్ దూరం పెట్టడం ఎంతో అత్యవసరం.. బయట ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ వాటిని పడకగది వరకు తీసుకురాకపోవడమే మంచిది.. నిద్రపోయే సమయానికి అన్నిటిని మరచిపోయి ప్రశాంతంగా ఉండాలి.. అలాగే ఒకసారి దీర్ఘ స్వాస తీసుకుని ప్రశాంతంగా నిద్ర పోవాలని మనస్ఫూర్తిగా అనుకోవాలి…
రాత్రి భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు దీని వలన ఆకలితో సరిగ్గా నిద్ర పట్టదు అదేవిధంగా పడుకోవడానికి ముందు గొరవచ్చని పాలు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది బాగా అలసిపోయి వస్తే వేడి నీళ్లతో స్నానం చేయడం కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.. అలాగే ముఖ్యంగా రోజు ఒకే సమయానికి నిద్ర పోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు దీర్ఘకాలం నిద్రలేమి వాళ్ళ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే వీలైనంతవరకు ఈ సమస్యను ముందులోనే పరిష్కరించుకోవడం మంచిది..