Health నెలసరి కొందరిలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అలాగే పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది.. అయితే అసలు ఎంత బ్లీడింగ్ అవ్వాలి.. ఎక్కువగా పెయిన్ వస్తే ఏం చేయాలి వంటి విషయాలు తెలుసుకుందాము..
సాధారణంగా 21 రోజుల నుంచి 40 రోజుల వరకు రుతుక్రమం రావచ్చు.. అయితే 28 రోజులకు వస్తే సక్రమంగా వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు అలాగే ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చినా పెద్ద సమస్యగా పరిగణించక్కర్లేదు అలాగే ఈ సమయంలో 30 నుంచి 72 ఎం ఎల్ రక్తం విడుదలవుతూ ఉంటుంది అంటే దాదాపు 5 నుంచి 12 టేబుల్ స్పూన్ల వరకు అనుకోవచ్చు.. అయితే రక్తం 80 ఎం ఎల్ దాటి అవుతుంటే మాత్రం హెవీ బ్లీడింగ్ గానే పరిగణించాలి..
ముఖ్యంగా గంటకొకసారి పాడ్ మార్చాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా నడుము నొప్పి కడుపునొప్పి వంట సమస్యలు వస్తున్నా హార్మోన్లో మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడానికి డాక్టర్ని సంప్రదించాలి.. అలాగే హార్మోన్లో హెచ్చుతగ్గులు గర్భాశయంలో కణతులు ఉన్నప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది అలాగే మోనోపాస్కు దగ్గర పడిన మహిళల్లో కూడా హెవీ బ్లీడింగ్ కనిపిస్తుంది.. పీరియడ్స్ టైమ్‌లో వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మందులు వాడడం అంత మంచిది కాదు. దీనివల్ల భవిష్యత్‌లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి మనల్ని వేధించే కడుపునొప్పి, ఇతర సమస్యలను ఎలా తగ్గించుకోవాలంటే.. దీనికి పరిష్కారం ఉందని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే.. ముందుగా తులసి ఆకులని తీసుకోవాలి.. అలాగే కొన్ని రకాల మందులు వాడినప్పుడు అవి హార్మోన్ల పైన ప్రభావం చూపిస్తూ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.. అలాగే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినప్పుడు కూడా ఇదే జరుగుతుంది..