Health ఈ రోజుల్లో మనుషుల జీవనశైలి మారిపోతుంది దీంతో పలు అనర్ధాలు వస్తున్నాయి ఇందులో ఒకటే వెన్నునొప్పి ముఖ్యంగా సరైన శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండటం అలాగే కూర్చొని చేయాల్సిన పనులు ఎక్కువ అవటం వంటి ఎన్నో కారణాలతో నడుము నొప్పి దీర్ఘకాలం వేధిస్తూ ఉంటుంది.. ఈ నొప్పి నుంచి బయటపడాలి అంటే బామ్స్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ ఉంటూనే ఉంటాయి అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగానే పనిచేస్తాయని దీర్ఘకాలం వీటి ప్రభావం ఉండదని తెలుస్తోంది..
స్థూలకాయం ఉన్నవారికి ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది అందుకే ఎలాంటి వారు బరువు తగ్గటంపై మనసు పెట్టాలి.. అలాగే ఈ నొప్పితో బాధపడేవారు తరచు వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.. అలాగే కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవడం నిలుచున్నప్పుడు పక్కకి వంగిపోకుండా ఉండటం వంటివి చేయడం వల్ల వెన్ను ముక పై భారం పడకుండా ఉంటుంది.. అలాగే వెన్నెముకను సక్రమంగా ఉంచడానికి టేప్, పట్టీలు లేదా స్ట్రెచి బ్యాండ్‌లను ఉపయోగించవచ్చు. ఎన్ని పనులు ఉన్నా టైంకి ఎక్ససైజ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ముఖ్యంగా రెండు చేతుల వేళ్ళతో కాలవేళ్లను ముట్టుకోవాలి ఇలా చేసేటప్పుడు మనుషులు నిటారుగా నిలువడం మాత్రం మర్చిపోకూడదు. అలాగే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చొని చేసే పనులు ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి అలాగే కూర్చున్న చోట నుంచి లేచి నడవడం అలవాటు చేసుకోవాలి.