Crime మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది ఓ హాస్టల్ లో గిరిజన విద్యార్థి పట్ల అమాంశంగా ప్రవర్తించింది మహిళా సూపర్డెంట్..
సమాజం ఎంతలా మారుతున్న కొన్ని పరిస్థితులు మాత్రం ఎప్పటికీ మారటం లేదు అలాగే తక్కువ స్థాయిలో ఉన్న వారిని అణగారిని వర్గాలని కించపరిచే పరిస్థితి మాత్రం మారడం లేదు ఏమి చేయలేరనే అహంకారంతో కొందరు వారి కింద వారిని తీవ్ర అవమానాలు పాలు చేస్తున్నారు ఇలాంటి ఓ సంఘటన తాజాగా మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకోవడంతో వైరల్ గా మారింది..
మధ్యప్రదేశ్లో ఓ హాస్టల్ లో గిరిజన విద్యార్థి పట్ల అమానుషం చోటుచేసుకుంది.. డబ్బును దొంగలించిందని అనుమానంతో ఆ హాస్టల్ మహిళా సూపర్డెంట్ ఐదవ తరగతి చదువుతున్న ఓ బాలికతో దారుణంగా ప్రవర్తించింది.. విద్యార్థిని మెడలో బూట్ల దండ వేసి ఊరేగించింది.. వివరాల్లోకి వెళితే గతవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే బేతుల్ జిల్లాలోని దామ్జీపురా గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో ఐదో తరగతి చదువుతున్న ఆ గిరిజన బాలిక డబ్బులు దొంగ అనుమానంతో ఆమె మెడలో బూట్లదండ వేసి సూపర్డెంట్ ఊరేగించడంతో ఆ బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయు చేసింది.. ఆ తర్వాత మీరు ఈ విషయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ అమన్వీర్ సింగ్ బైన్స్కు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాలిక తండ్రి నుండి రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించిన తర్వాత కలెక్టర్ బెయిన్స్ విచారణకు ఆదేశించారు దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..