Crime కొందరు చేసే పనులు నిజంగానే షాక్కు గురిచేస్తాయి ఇలా ఎలా ప్రవర్తిస్తారో కూడా అర్థం కాకుండా ఉంటుంది ఇలాంటి ఓ షాకింగ్ సంఘటన హనుమకొండలో చోటుచేసుకుంది..
హనుమకొండ లో ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బంది బరితెగించి ప్రవర్తించారు అంతేకాకుండా ఆస్పత్రిలో ఉన్నామని విషయాన్ని మరిచిపోయి తమకు నచ్చినట్టు చేశారు అసలు తాము వచ్చిన బాధ్యత ఏంటో కూడా గుర్తు లేకుండా ప్రవర్తించి అందర్నీ షాక్కు గురి చేశారు అయితే అసలు విషయం ఏంటంటే.. హనుమకొండలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది మరో ఇద్దరు స్నేహితులని పిలిచే ఆసుపత్రిలోనే ఏకంగా బార్ ఓపెన్ చేసేసారు వీరు గదిలో తమతో పాటు తెచ్చుకున్న బీర్లను ఓపెన్ చేసి తాగటమే కాకుండా ఫుల్ గా ఎంజాయ్ చేశారు.. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన ఆసుపత్రి సిబ్బందిని సైతం నివ్వరపరిచింది..
ఆస్పత్రిలో రోగులు అందర్నీ గాలికి వదిలేసి మీరు మాత్రం బీర్లు తాగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు అంతే కాకుండా ఇంతకుముందు మీరు ఆస్పత్రికి వచ్చిన రోగుల దగ్గర అదనంగా డబ్బులు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. వీరిలో ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్సు, మరొక GNM ఉన్నారు.. అయితే ఈ విషయం ప్రస్తుతం బయటికి రావటంతో ఆసుపత్రి యాజమాన్యం వీరిపై తగిన చర్యలు తీసుకోనుందని సమాచారం.. అంతేకాకుండా వీరిని విధుల నుంచి తప్పించేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది