Politics ఎందరో హిందువులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుంది అయితే త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తయిపోతుందని భక్తులను అనుమతిస్తారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి అయితే ఈ విషయంపై తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక క్లారిటీ ఇచ్చేశారు..
హిందువుల ఆత్మభిమానం అయోధ్య రామ మందిరం.. ఎన్నో ఏళ్ళు గా ఎందరో ప్రాణాలు విడిచి ఈ ఆలయాన్ని దక్కించుకున్నారు.. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తవుతుంది.. అయితే వచ్చే ఏడాది నుంచి భక్తులను అనుమతి ఇస్తారని ముందే చెప్పేసింది మోడీ ప్రభుత్వం.. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన హోం మంత్రి అమిత్ షా వచ్చే ఏడాది జనవరి ఒకటి కల్లా ఆలయం పూర్తయిపోతుందని అప్పటినుంచి భక్తులను అనుమతి ఇస్తారని తెలిపారు.. 2019 నవంబర్ 9న ఈ వివాదం పై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది ఈ స్థలంలో రామాలయం కట్టుకోవడానికి అనుమతి ఇవ్వటంతో ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఆగస్టు ఐదున భూమి పూజ చేసి ఈ ఆలయం నిర్మాణాన్ని చేపట్టారు..
తాజాగా త్రిపురా లో జరిగిన సమావేశంలో మాట్లాడిన హోమ్ మంత్రి అమిత్ షా.. అయోధ్య రామ మందిరం కోసం దేశ ప్రజలందరూ ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్నారని ఇప్పుడు ఆ కల నెరవేరి పోతుందని అన్నారు.. ఇందుకోసం కేసు కోర్టులో ఎన్నో ఏళ్ళు నడిచిందని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని గుర్తు చేశారు.. అలాగే ప్రధాన మోడీ ఆలయాన్ని మొదలుపెట్టారని మరొకసారి గుర్తు చేశారు.. అలాగే సందర్భంగా ‘‘రాహుల్ బాబా విను.. 2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.