Political తెలంగాణలో సెప్టెంబర్ 17న భాజాపా ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలతో భేటీ అయిన అమిత్ షా.. భాజపా కోర్ కమిటీ భేటీలో బూత్ కమిటీలు పక్కాగా పనిచేయాలని నిర్దేశించారు.
ఈ సంద్భంగా తెలంగాణ విమోచన వేడుకలు, ఏడాది పాటు తెలంగాణలో నిర్వహించే అంశాలు, మునుగోడు ఉప ఎన్నిక, పార్లమెంట్ ప్రవాస్ యోజన, తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై భాజాపా నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే తెలంగాణలో గ్రామాల వారీగా ఇన్చార్జిల్ నియమించి భాజపా పార్టీలో చేరేవారిని ప్రోత్సహించాలని అన్నారు ఇదే సందర్భంగా జాయినింగ్ కమిటీ పనితీరుపై ఆరా తీశారు మునుగోడు ఉపఎన్నికలపై ఫోకస్ పెట్టాలని భారీ మెజార్టీతో అక్కడ గెలిచేలా వ్యూహం రచించాలని స్పష్టం చేశారు..
అయితే తెలంగాణలో కాంగ్రెస్ బలం ఏం లేదని అయితే ఎప్పటికైనా ఇక్కడ కాంగ్రెస్ తెరాస ఏకం అవ్వచ్చు అని తెలిపారు.. ఈ భేటీలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచనం కోసం పాటుపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని అలా మర్చిపోతే దేశద్రోహం చేసినట్టేనని తెలిపారు.. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమిత్ షా.. మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లిన అమిత్ షా అధికారులతో సమావేశం అయ్యారు.