Health ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కనిపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ప్రయాణాల్లో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని ఏకధాటిగా పాటలు వింటూ సినిమాలు చూస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ఎక్కువగా వాల్యూం పెడుతూ ఉంటారు ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరమని దీర్ఘకాలం వినికిడి సమస్య లోపించడమే కాకుండా నరాలకు సంబంధించి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ బ్లూటూత్ పెట్టుకొని చెవులని అసలు ఖాళీ ఉంచడం లేదు ముఖ్యంగా ఎక్కువ వాల్యూంతో పాటలు వినడం అలవాటు చేసుకొని లీనమైపోతున్నారు అయితే ఇలా చేయడం వల్ల వినికిడి సమస్య వస్తుందని తెలుస్తోంది దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే పెను ప్రమాదం తప్పదని కూడా అంటున్నారు అలాగే ఈ రకంగా ఎక్కువ సేపు ఉండటం వల్ల చెవులు నొప్పి పుట్టడంతో పాటు వయసు పైబడినప్పుడు వచ్చే వినికిడి సమస్య ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అలానే ఇలాగే కాసేపు ఉంచితే తల తిరగటం, వాంతులు అవ్వటం, నరాలకు సంబంధించిన సమస్యలు రావడం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. అందుకే ఈ రకంగా హై వాల్యూం పెట్టుకొని పాటలు వినకుండా ఉండాలని ఒకవేళ అవసరం అయితే తక్కువ వాల్యూంతో వినడం వల్ల ఆ సమస్య నుండి కొంతైనా గట్టెక్కవచ్చు అని తెలుస్తోంది..