Entertainment హీరోయిన్ పూర్ణ గత ఏడాది జూన్లో శానిద్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అయితే పూర్ణ త్వరలోనే తల్లి కాబోతుంది. కొన్ని రోజుల క్రితమే పూర్ణకు శ్రీమంతం జరగగా ప్రస్తుతం బేబీ బుంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి..
హీరోయిన్ పూర్ణ శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ తో జంటగా నటించిన సీమటపాకాయ్ చిత్రం మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత అవును, రాజుగారు గది, దృశ్యం 2, అఖండ లాంటి సినిమాలతో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత మాత్రం అవకాశాలు క్రమంగా తగ్గడంతో సినిమాలు కొన్ని డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది. ప్రస్తుతం పూర్ణ ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న పూర్ణ తన పెళ్లి భర్త శ్రీమంతానికి సంబంధించిన ఫోటోలను ఇప్పటివరకు పంచుకుంటూ వచ్చారు. అయితే తాజాగా బేబీ బంప్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు ఈ ఫోటోలో పింక్ కలర్ గా ఉందో పూర్ణ మెరిసిపోయారు. ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్న పూర్ణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలో ఆమె చాలా అందంగా కనిపించారు. ఈ ఫోటోలు చూసినా ఆమె అభిమానులంతా లైక్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..