Entertainment రవితేజ శ్రీ లీలా జంటగా నటించిన ధమాకా చిత్రం ఈనెల 23న ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.. తజాగా ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు.. ఈ సక్సెస్మెంట్ ను మాస్ మీట్ పేరుతో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు వచ్చారు అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ పలు విషయాలు తెలిపారు..
ధమాకా సక్సెస్మెంట్లో మాట్లాడిన రవితేజ.. “ఈ సినిమాకి సంబంధించి ముందుగా నా టెక్నీషియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ వలన ఈ సినిమా తెరపై ఇంత కలర్ఫుల్ గా కనిపించింది. మేము కూడా చాలా అందంగా కనిపించాము. ఈ సినిమా సక్సెస్ కి మొదటి కారణం భీమ్స్ అందించిన సాంగ్స్. తను ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. అలాగే ఈ సినిమా మొదలైంది మొదలు పూర్తి ఏకాగ్రత అందరికీ సినిమా విజయం పైన ఉంది ప్రేక్షకులకు వచ్చే విధంగా సినిమాని తర్కెక్కించాలని ఎంతగానో ఆరాటపడ్డారు.. ఇక రెండో కారణంగా నిర్మాతలు.. వాళ్ల అంకితభావాన్ని గురించి చెప్పుకోవాలి. అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్స్ చెప్పాలి.. అలాగే ఈ బ్యానర్లో మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తోంది. మరో కారణంగా బెజవాడ ప్రసన్న కుమార్ పేరు చెప్పాలి. ఈ సినిమాలో మీరంతా ఎంజాయ్ చేస్తున్న డైలాగ్స్ ఆయన రాసినవే. ఇక శ్రీలీల టాలెంట్, గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తను డాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇక ఈ బస్ కి డ్రైవర్ త్రినాథరావు అయితే నేను కండక్టర్. మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. ‘ అంటూ ముగించాడు.