Rebel Star Prabhas Birthday : ప్రభాస్ ఆ మూడక్షరాల పేరు వినపిస్తే చాలు తెలియకుండానే మనసులోనే డార్లింగ్ అనుకుంటాం ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్. ఆరడుగుల పైనుండే ఆ కటౌట్‌కి ప్రపంచ నలు చెరగులా అభిమానులే నందమూరి, అక్కినేని, కొణిదెల, దగ్గుబాటి వీరందరికి సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. ప్రభాస్‌కి అతని సినిమాకి మాత్రం తన ఫ్యాన్స్‌తో పాటు అందరి హీరోల ఫ్యాన్స్ జతవుతారు.
ఈశ్వర్ చిత్రానికి రెండుకోట్లు ఖర్చు ఆ సమయంలో ఆ డబ్బు రిటర్ను రాలేదు. తర్వాత సినిమా రాఘవేంద్ర పెద్ద ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ రాజు ఫీలవ్వలేదు. కారణం తనకు నిర్మాత యం.యస్ రాజు ఉన్నాడని ఆలస్యం చేయలేదు వర్షం చేశారు. వర్షానికి ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ తుఫానయ్యింది. ప్రభాస్ మాస్ హీరో అయ్యాడు. తెలుగు అమ్మాయిల ఊహకు కరెక్ట్ కటౌట్ దొరికాడు. అక్కడనుండి అందరి తెలిసిన కథే ఫ్లాప్‌లు, హిట్‌లు మధ్య మధ్యలో రాజమౌళి ప్రభాస్‌రాజు గారిని చత్రపతి చేసింది. అతనికి హిట్టొచ్చినా అంతే, ఫ్లాపొచ్చినా అంతే అదే నవ్వు అదే రాజసం..ఎక్కడా తగ్గలేదు..తలొగ్గలేదు.. అంతే స్వీట్‌గా ఉండేవాడు. ప్రేమతో పెట్టి చంపేస్తాడని మంచి బిరుదు ఆ ప్రేమే ఆయనకి ఆశీర్వాదం అయ్యింది అందరికి డార్లింగ్ అయ్యాడు.
అప్పటివరకు ఏడాదికో సినిమా రెండెళ్లకో ఫ్లాప్ కూల్‌గా మేనేజ్ చేశాడు. బాహుబలి సినిమా షూటింగ్ స్టార్స్ చేశారు. అతనెప్పుడు పెద్దగా బయట కనిపించలేదు. 10 జూలై 2015న బాహుబలి విడుదలైంది. అంతే తెలుగు సినిమా అద్భుతం ఆవిష్కృతమైంది. మాటల్లేవ్ మాట్లాడుకోటాల్లేవు. తెలుగు సినిమా పతాకం ప్రపంచవ్యాప్తంగా ఎగిరింది. ఆ రోజు నుండి ఈ పదేళ్లుగా వచ్చిన సినిమాలన్నిటికి ముందు నాన్ బాహుబలి రికార్డ్స్ అని రాయటం, వినటం తెలుగు వారికి అలవాటయ్యింది.
రెండు కోట్ల హీరో పుష్కర కాలంలో రెండువేల కోట్ల హీరో ఎలా సాధ్యం చాలా సింపుల్ కంటెంట్– కమాండ్– కూల్– ప్యాషన్– పేషన్స్ ఇవే మన రాజుగారి ఆయుధాలు. వాటితో ఎంతమంది ప్రేమనైనా పొందొచ్చు. మ్యాటర్ ఉంటే మీటర్లతో పనిలేదు. ఈ రోజుతో 45 ఏళ్లు పూర్తి, స్టిల్ బ్యాచిలర్…సారీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. మీరిలాగే నవ్యుతూ ఉండాలి అని కోరుకుంటూ… హ్యాపి బర్త్‌డే డియర్ డార్లింగ్ ప్రభాస్.