FILM NEWS : ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో “తమ్ముడు” సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
“తమ్ముడు” సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి ఫెస్టివల్ బ్రేక్ లేకుండా శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు వీలైనంత త్వరగా హై క్వాలిటీతో మూవీ కంప్లీట్ చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను “తమ్ముడు” సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. త్వరలోనే “తమ్ముడు” సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Actors – Nithiin, Laya
Technical team –
Banner – Sri Venkateswa Creations
Producer – Dil Raju, Shirish
Written – Directed by – Sriram Venu
Cinematography – KV Guhan
Music – B Ajaneesh Loknath
Editing – Prawin Pudi
PRO – GSK Media, Vamsi Kaka
Marketing – Vishnu Thej Putta