దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సంధర్భంగా హైదరాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొంది
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. టీజర్, ట్రైలర్‌లో మీరు చూసింది కేవలం ఒక్క శాతమే. సినిమా చూసే వాళ్లు కచ్చితంగా అద్బుతమైన అనుభూతికి లోనవుతారు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, ఐడియా అందుకే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్స్ సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. నేను త్వరలోనే తెలుగు సినిమా చేస్తాను. హను రాఘవపూడి, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో చేస్తున్నాను. పూర్తి తెలుగు చిత్రంగా ఉండాలని నేనే డబ్బింగ్ చెప్పాను. మీరు సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మీ ఫీడ్ బ్యాక్ వినేందుకు నేను ఎదురుచూస్తున్నాను. నవంబర్ 12న థియేటర్లో కలుద్దామ’ని అన్నారు.