నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, నవీన్, రవిశంకర్, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ : ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అంతగానే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా వారు అంత చెప్పినట్లు నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడిఉంటాను. అలాగే నా భార్య వసుంధరకు ధన్యవాదాలు.