Political ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశపెట్టిన బిల్లు నిన్న ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఒక హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం అంత తేలికైన పని కాదని అంటున్నారు వైద్య విశ్లేషకులు. దీని వెనక ఎన్నో సమస్యలు ఉంటాయని చెప్తున్నారు..
విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలని తప్పుపడుతున్నారు వైద్య విశ్లేషకులు.. కేవలం ప్రభుత్వం బిల్లు ఆమోదించినంత మాత్రాన పేరు మారిపోదని.. అంతర్జాతీయంగా ఈ యూనివర్సిటీ ఒక మంచి పేరును సంపాదించుకుందని ఇప్పుడు ఆ పేరును మారిస్తే యూనివర్సిటీ కి ఉన్న విలువ పడిపోతుందని అంటున్నారు.. అలాగే పేరు మార్పుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వంటి సంస్థలు కమిటీలను నియమించాల్సి ఉంటుంది. ఆ కమిటీ సభ్యులు యూనివర్సిటీకి పెట్టిన కొత్త పేరును గుర్తించాలి.. అంత జరగాలి.. కొత్త పేరుతో యూనివర్సిటీకి గుర్తింపు రావడానికి ఎంత లేదనుకున్నా కనీసం నాలుగేళ్లు పడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు.. ఆ గుర్తింపు లేకుంటే ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థులు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష రాయడం కుదరదు. అంతేకాకుండా ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరడానికి కూడా అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు.
ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం వైయస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ఈ యూనివర్సిటీ పేరు ముందు డాక్టర్ చేర్చారు అలాంటి యూనివర్సిటీ పేరును మార్చి వైయస్సార్ పేరుని పెట్టిన ఏం లాభం అంటూ తప్పు పడుతున్నారు రాజకీయనేతలు.