కరోనా మహమ్మారి మన జీవితంలో ఊహించని మార్పులను తెస్తుంది. ఉద్యోగులు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలలో తేలింది. ఉద్యోగులు గంటల తరబడి కూర్చుని పనిచేయడంతో వెన్ను నొప్పి సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం, 80 శాతం మంది పెద్దలు వారి జీవితంలో ఒక్కసారైనా వెన్నునొప్పిని అనుభవించి ఉంటారు. అయితే ఈ నొప్పిని తేలికగా తీసుకోవద్దు. మీ మొత్తం బరువులో మెడ నుంచి తొడల వరకు ఉండే శరీర భాగం సగం బరువు కలిగి ఉంటుంది. కనుక వెన్నునొప్పికి కారకం అవుతుంది. వెన్నునొప్పి(Back Pain), నడుము నొప్పిని తగ్గించడానికి ఈ ఆరోగ్య సూత్రాలను పాటించండి.
నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు. తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, ఒక కప్పు అయ్యే వరకూ మరిగించాలి. వడగట్టి, చల్లార్చిన తర్వాత తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.